విధాత,హైదరాబాద్ : స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ లను బదీలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐపీఎస్ స్థాయి నుంచి అదనపు డీజీగా స్థాయి అధికారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏడీజీ పర్సనల్ గా దేవంద్ర సింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా పరిమళ్ నూతన్, పోలీస్ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖిా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగ వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Police : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ జిల్లాల ఎస్పీలు, డీసీపీలు, ఏడీజీ స్థాయి అధికారులకు కొత్త పోస్టింగులు ఇచ్చింది.

Latest News
మాజీ భార్య, ప్రస్తుత ప్రియురాలు ఒకే ఫ్రేమ్‌లో ..
మాల్దీవ్స్ లో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్న దీపికా పిల్లి
ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు.. ట్రంప్ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
సంక్రాంతి బాక్సాఫీస్‌కి మెగా జోష్ ..
యూరప్‌కు ‘పెద్ది’ టీమ్ ..
‘దొరికేస్తాడు’ అనుకున్నవాళ్లకు ఝలక్ ఇచ్చిన అనిల్ రావిపూడి ..
రేపే భోగి పండుగ..! భోగి మంటలు ఏ సమయంలో వేయాలంటే..?
సంప్రదాయానికి భిన్నంగా.. 18న మేడారంలో కేబినెట్ భేటీ..!
ఊపిరితిత్తులు బలంగా, స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగం..!