Site icon vidhaatha

Minister Damodar | 33తో 114పోల్చి చూసుకోండి.. మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి దామోదర కౌంటర్

విధాత, హైదరాబాద్ : స్థానికత వివాదంలో జీవో 33ని వ్యతిరేకించేవాళ్ళు 114 జీవో చూడండని రెండింటిని పోల్చుకునే చూస్తే మీకే విషయం అర్ధమవుతుందని ని మాజీ మంత్రి హరీష్ రావు కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహాన లేకుండా తెచ్చిన జీవో 33తో ఎంబీబీఎస్‌, బీఎండీఎస్ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీశ్‌రావు తప్పుబట్టారు. దీనిపై స్పందించిన దామోదర రాజనరసింహ జీవో 33,114లను పోల్చి చూసుకుంటే మెడికల్ అడ్మిషన్ల విషయంలో పరిష్కారం కనిపిస్తుందన్నారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ మా హయాంలో 30 వరకు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. 95 శాతం పైగా ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే వచ్చే విదంగా మేము చేశామని, బి కేటగిరీలో కూడా తెలంగాణ వాళ్ళకే సీట్లు ఎక్కువగా ఇచ్చాము.

కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో రిజర్వ్ కోటా లేకుండా చేశారని విమర్శించారు. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం కొత్తగా జీవో తెచ్చిందని, ఈ నాలుగేళ్ల నిబంధన తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇంటర్ తో పాటు లాంగ్ టర్మ్ కోసం వేరే రాష్ట్రాలకు వెళతారని, ఇలా వరుసగా నాలుగేళ్ళు చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం జీవో ఇచ్చిందని హరీశ్‌రావు తప్పుబట్టారు. మెడిసిన్ ప్రవేశాలకు సమగ్ర ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదని, జీవో 33 సక్రమంగా లేదని, దీనివల్ల తెలంగాణ విద్యార్థుల కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయలని.. మేము వచ్చి మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం వెంటనే హై లెవల్ కమిటీ వేసి ఈ స్థానికత పై చర్చించాలని డిమాండ్ చేశారు.

Exit mobile version