విధాత : ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగాఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బీజేపీ లక్షలాది బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగింపు చేసి పెద్ద ఎత్తున ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు.
రాహుల్ గాంధీ జీ ఈ తీవ్రమైన సమస్యను భారత ప్రజల ముందుకు ధైర్యంగా తీసుకువచ్చారన్నారు. ఓటు చోరీ బాధ్యులపై చర్య తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఆశ్చర్యకరంగా రాహుల్ గాంధీనే లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు.“జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పిలుపుతో, అవగాహన కల్పించడానికి, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరడానికి మేము కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.