Site icon vidhaatha

MLA Danam Nagender | కేంద్ర మంత్రులను హైదరాబాద్‌లో తిరగనివ్వం: ఎమ్మెల్యే దానం నాగేందర్‌

విధాత, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు తేలేని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిని హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మల సీతారామన్ గతంలో తెలంగాణలో పర్యటన సందర్భంగా రేషన్ షాపుల దగ్గర ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని డీలర్‌ను, కలెక్టర్ ను ప్రశ్నించారని, ఇప్పుడు తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని మండిపడ్డారు. దేశానికి ఇలాంటి ఆర్థిక మంత్రి ఉండటం అరిష్టం అని, తెలంగాణ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలన్నారు.

బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధకరమని అన్నారు. విభజన తర్వాత 2 రాష్ట్రాలు చాలా నష్టపోయాయని, పదేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనకు, ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రలు ఎన్నో సార్లు అడిగినా.. బడ్జెట్ లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరమన్నారు. ఇకనైనా ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మంత్రి పదవులకు రాజీనామా చేసి తమ నిజాయితీ నిరుపించుకోవాలని దానం డిమాండ్ చేశారు.

Exit mobile version