Site icon vidhaatha

ABVP | తెలంగాణ కదనభేరికి కదిలిరండి: ఏబీవీపీ

ABVP |

విధాత: రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతిరహిత తెలంగాణ నవ నిర్మాణానికి కదం కదం కలిపి కదనభేరీని మోగిద్దామని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) తెలంగాణ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే ‘తెలంగాణ కదనభేరి’ విజయవంతం చేయాలని కోరింది.

రాష్ట్ర ప్రభుత్వ వంద వైఫల్యాలపై ఛార్జిషీట్‌ విడుదల చేస్తామని ఏబీవీపీ పేర్కొన్నది. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వం అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించింది. ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన వాగ్దానం వమ్ము అయ్యిందని తెలిపింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలతో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను ఆడుకుంటున్నదని ఆరోపించింది. లీకేజీలు, ప్యాకేజీలతో కేసీఆర్‌ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తున్నదని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కల్వకుంట్ల కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఏబీవీపీ తెలిపింది.

Exit mobile version