విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్
జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కేటీఆర్ పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఖండించారు. ఈ సందర్భంగా గాదరి కిషోర్ సీఎం రమేష్ ను దూషిస్తూ మాట్లాడారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఫిర్యాదు నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిషోర్ కు నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ తన వద్ధకు వచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని అన్నారని సీఎం రమేష్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన గాదరి కిషోర్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ తోడ్కల్ తీస్తాం కొడకా అంటూ సీఎం రమేష్ ను హెచ్చరించారు. సీఎం రమేష్ అనేటోడు ఒక బ్రోకర్.. కేటీఆర్ గురించి మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నీ తోడ్కల్ తీస్తా నంటూ హెచ్చరించారు. చంద్రబాబు బూట్లు నాక్కుంట.. బీజేపీ అధికారంలోకి రాగానే నన్ను ఎక్కడ జైల్లో పెడతారో అని భయపడి మోదీ సంకల కూసున్న ఒక బ్రోకర్ అంటూ గాదరి కిషోర్ విమర్శించారు.