Site icon vidhaatha

Nalla Pochamma Bonalu | ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మకు భట్టి దంపతుల బోనాలు

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

విధాత, హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనివాసం ప్రజాభవన్ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ గుడిలో అమ్మవారికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సతీమణి నందినిలు ఆదివారం బోనం సమర్పించారు. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవన్‌కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు భట్టి విక్రమార్క దంపతులు వేద పండితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.

Exit mobile version