Site icon vidhaatha

TELANGANA | గ్రూప్ 2 ప‌రీక్ష‌లు వాయిదా నిర్ణ‌యంపై ఓయూలో .. సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం..

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన ఓయూ ఎన్ఎస్‌యూఐ విభాగం

విధాత‌, హైద‌రాబాద్‌:నిరుద్యోగుల అభ్య‌ర్థ‌న మేర‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించి గ్రూప్ 2 ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింద‌ని ఓయూ ఎన్ఎస్‌యూఐ విభాగం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. సీఎం చిత్ర ప‌టానికి ఈ సంద‌ర్భంగా పాలాభిషేకం చేశారు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్‌ను భ‌ర్తీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. డీఎస్సీ, గ్రూప్ 2 ప‌రీక్ష‌ల మ‌ధ్య వ్య‌వ‌ధి కావాల‌ని కోరిన నిరుద్యోగుల అభ్య‌ర్థ‌న‌కు ప్ర‌భుత్వం స్పందించింద‌న్నారు. దీంతో నిరుద్యోగుల‌కు జాబ్ సంపాందించే అవ‌కాశాలు క‌ల్పించిన‌ట్ట‌య్యింద‌న్నారు. ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాల‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తుంద‌ని, డీఎస్సీ ద్వారా 11వేల పోస్టులు భ‌ర్తీ కానున్నాయ‌న్నారు. బీఆరెస్ పార్టీ నిరుద్యోగుల‌ను విచ్చిన్నం చేసి రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకు కుట్ర చేసినా నిరుద్యోగులు వారిని న‌మ్మ‌లేద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ అధికార ప్ర‌తినిధి చ‌న‌గాని ద‌యాక‌ర్, ఎన్ఎస్‌యూఐ ఓయూ అధ్య‌క్షుడు మెడ శ్రీ‌ను, విన‌య్‌, ఓయూ జాక్ నేత రాజేశ్, సురేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version