Site icon vidhaatha

ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.. ఔట్‌సోర్సింగ్ఉ ద్యోగుల డిమాండ్

విధాత, హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ శనివారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్(జేఏసీ) నాయకులు మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి నెలా జీతాలివ్వాలన్నారు. ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము బిచ్చం అడుగతలేమని.. చేసిన పనికి జీతం మాత్రమే అడుగుతున్నామన్నారు. నెలనెల జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. చాలామందిని నోటీసులు లేకుండానే తొలగించి రోడ్డు మీద పదేశారని తెలిపారు. తొలంగించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్నారు. 20 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. ఆరు నెలలుగా తమకు జీతాలు రావడంలేదని తెలిపారు. డ్యూటీలో చనిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్లను పట్టించుకుని పరిష్కరించాలని విజ్ఙప్తి చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు పలువురు రాజకీయ పార్టీల నాయకులు, నేతలు సంఘీభావం ప్రకటించారు

Exit mobile version