Site icon vidhaatha

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పరకాల ఎమ్మెల్యే రేవూరి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను పరకాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయా పథకాలను మహిళలు, పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆర్టీసీ బస్సు ముందు ఎమ్మెల్యే పచ్చ జెండాను ఊపి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ శ్రీనివాస్, పురపాలక కమిషనర్ శేషు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version