Site icon vidhaatha

తెలంగాణకు ప్రధాని మోదీ రాక

పార్లమెంటు ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 30న ఆందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభకు ప్రధాని మోదీ హాజరవుతారని, అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారని తెలిపారు. మే 3న వరంగల్ పార్లమెంటు స్థానం పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారని, అదేరోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరవుతారని తెలిపారు. మే 4న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version