Police Raided Pubs | హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బార్లు, పబ్‌లపై శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల సందర్భంగా 12ప్యానల్ డ్రగ్ డిటెక్షన్ కిట్ల (Drug Detection Kit)తో పరీక్షలు నిర్వహించడం 50మందికి పైగా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. వారిని విచారణకు తరలించి, పబ్బులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి (Kamalasan Reddy) ఆధ్వర్యంలో తనిఖీలు సాగాయి. 25 ప్రత్యేక బృందాలతో చొప్పున పబ్బులు, బార్లపై ఆకస్మిక దాడులు జరిగాయి.
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
నగరంలోని చందానగర్ స్పా సెంటర్ (Spa Centers) పై పోలీసులు నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని సెలూన్ షాప్‌పై పోలీసులు దాడులు చేశారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సెంటర్‌లో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.