హైదరాబాద్, విధాత : తెలంగాణలో బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఈ పోరాటం ఆగదని, అందరూ ఏకమై రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈనెల 18న జరిగే రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తాకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ ముగింపు కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం బీసీల పట్ల వ్యవస్థలు వ్యతిరేకంగా ఉన్నాయనడానికి నిదర్శనమని వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీసీ జేఏసీ కో చైర్మన్ డి. రాజారాం యాదవ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.. ఈ సమావేశంలో బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు మేకల కృష్ణ, కొత్త లక్ష్మణ్ పటేల్, నీలకంఠం ముదిరాజ్, బొమ్మ అమరేందర్ పాల్గొన్నారు.
Bc Leader R Krishnaiah : బీసీ రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తగలాలి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ బంద్ సెగ ఢిల్లీకి తాకాలని, పోరాటం ఆగేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Latest News
హైదరాబాద్ బంగారం–వెండి ధరల్లో తగ్గుదల: ఇవాళ్టి రేట్లు
వెండి ధర మరింత పైకి..తగ్గిన బంగారం ధర
పాత్ర కోసం పరిమితులు లేవు..
కేవలం రూ. 610 పెట్టుబడితో.. లక్షాధికారి అయిపోండి.. ఎస్బీఐ బంపరాఫర్
బెంగళూరులో ఏఎంబి సినిమాస్..
లోపాల పుట్ట 'భూ భారతి' పోర్టల్.. చెలరేగుతున్న మీసేవా కేంద్రాల ఏజెంట్లు
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జలగండం..! జర జాగ్రత్త..!!
న్యూజీలాండ్దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్
వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి
తిరుమల విమాన వెంకటేశ్వురుడికి ‘కాకబలి’ నివేదన చూడండి