విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి మారుపేరుగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట జాగృతి అధ్వర్వంలో కవిత మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అయ్యిందని.. కానీ మహిళలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, 4000 వేల పింఛన్ పెంపు హామీని మాత్రం అమలు చేయలేదు అని విమర్శించారు. రాబోయే బడ్జెట్ లో మహిళలకు రూ. 2500, విద్యార్థినులకు స్కూటీలు, రూ.4000 పింఛన్ కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, 2లక్షల ఉద్యోగాల హామీ అమలు చేయాలని, పెన్షనర్ల బకాయిలు, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
BioAsia 2026 : ఫ్యూచర్ విజన్ పాలసీలతో తెలంగాణ పురోగమనం : సీఎం రేవంత్ రెడ్డి
Gadham Vivek convoy attack| మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..క్యాతనపల్లిలో హై టెన్షన్
