Site icon vidhaatha

CP Sudheer Babu | ప్రజలకు అసౌకర్యం కల్గించే బార్లు, హోటళ్లపై చర్యలు: రాచకొండ సీపీ సుధీర్‌బాబు

పలు బార్లు, హోటళ్ల సీజ్

విధాత, హైదరాబాద్ : నిబంధనలను అతిక్రమించి ప్రజలకు అసౌకర్యం కల్గించేలా, అసాంఘీక చర్యలకు అడ్డాగా మారిన బార్లు, హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని, అందుకు ప్రోత్సహించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు వాటిని సీజ్ చేసినట్లుగా వెల్లడించారు.

ప్రజలకు అసౌకర్యం కలిగించిన శ్రీరస్తు బార్, రెస్టారెంట్, హోటల్ బొమ్మరిల్లు కాంప్లెక్స్‌ల మూసీవేతకు ఆదేశాలిచ్చినట్లుగా తెలిపారు. చట్టంలో నిర్ధేశించిన వేళలకు విరుద్ధంగా బార్లు, హోటళ్ల నిర్వహణ చేసినందునా, అలాగే సరైన ధృవ పత్రాలు లేకుండా కస్టమర్లను హోటల్ గదుల్లో అనుమతించి అసాంఘీక కార్యకలాపాలకు, రేప్‌లకు కారణమైనందుకే సదరు యాజమాన్యాలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్పించినా సహించేది లేదన్నారు.

Exit mobile version