Site icon vidhaatha

Raghunandan | స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలి: రఘునందన్

విధాత: దివ్యాంగులను కించపరుస్తూ మాట్లాడిన ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం (బిహెచ్ఎస్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సింది పోయి సమర్థించుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు.

స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. చాలామంది వైకల్యం కలిగిన వారు జీవితంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారని, ఉన్నత శిఖరాలకు చేరుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. దివ్యాంగులు అంటే డిజేబుల్డ్ కాదని వారు స్పెషల్లీ ఏబుల్డ్ అని వారన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను యావత్తు సమాజం ఖండించాలన్నారు.

Exit mobile version