Prabhas | యాక్షన్‌ హీరో ఇమేజ్‌ మధ్య ప్రభాస్‌ మనసు మాత్రం రొమాన్స్‌ వైపు.. ఫేవరెట్‌ దర్శకుడు ఎవరంటే!

Prabhas | పాన్‌ ఇండియా స్టార్‌గా దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్‌ సంపాదించుకున్నప్ర‌భాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన సినిమా అంటే కనీసం వెయ్యి కోట్లకు పైగా బిజినెస్‌ జరుగుతుందనే ట్రేడ్‌ అంచనాలు ఉన్నాయి.

Prabhas | పాన్‌ ఇండియా స్టార్‌గా దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్‌ సంపాదించుకున్నప్ర‌భాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన సినిమా అంటే కనీసం వెయ్యి కోట్లకు పైగా బిజినెస్‌ జరుగుతుందనే ట్రేడ్‌ అంచనాలు ఉన్నాయి. యాక్షన్‌, మైథాలజీ, ఫిక్షన్‌ జానర్లతో వరుస భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన ప్రభాస్‌ మార్కెట్‌ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌

ఇటీవల కాలంలో ప్రభాస్‌ చేసిన సినిమాలన్నీ దాదాపు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగాయి. అభిమానులు కూడా ఆయన్ని యాక్షన్‌ హీరోగానే చూడటం అలవాటు చేసుకున్నారు. ఆయుధం పట్టుకుని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్లు ఊగిపోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రొమాంటిక్‌ కామెడీగా వచ్చిన ‘ది రాజాసాబ్‌’తో కొంత భిన్నంగా ప్రయత్నించినా, ఇప్పుడు మళ్లీ భారీ యాక్షన్‌ ప్రాజెక్ట్‌లకే ఫోకస్‌ పెట్టారు.

Kalki 2898 AD సీక్వెల్‌, Salaar సీక్వెల్‌, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ ఇలా వరుసగా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలే చేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా, తనకు ఇష్టమైన జానర్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలేనని ప్రభాస్‌ వెల్లడించారు. ఒక చిట్‌చాట్‌లో మాట్లాడుతూ తన ఫేవరెట్‌ దర్శకుడు మ‌ణిర‌త్నం అని చెప్పారు. ఆయన రూపొందించిన గీతాంజ‌లి తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని తెలిపారు. యాక్షన్‌ హీరోగా పాపులర్‌ అయినప్పటికీ, మనసుకు దగ్గరైన జానర్‌ మాత్రం ప్రేమకథలేనని చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

పూరీపై ప్రశంసల వర్షం

తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సినిమా గురించి చెప్పాలంటే ఏక్ నిరంజన్ అని ప్రభాస్‌ తెలిపారు. దర్శకుడుపూరీ జ‌గ‌న్నాథ్‌ Puri Jagannadhపై ఆయన ప్రశంసలు కురిపించారు. “పూరీగారు హీరో క్యారెక్టర్‌ను రాసే విధానం అసాధారణం. నా కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ‘బుజ్జిగాడు’. ఆ పాత్ర వినగానే ఎలా చేస్తానో అని భయపడ్డాను. ‘ఏక్‌ నిరంజన్‌’ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో పాత్రను పూరీలా రాయగల దర్శకుడు మరొకరు లేరు” అంటూ ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రాజెక్ట్‌లు

ప్రస్తుతం ప్రభాస్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో సైనికుడిగా కనిపించబోతున్నారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీగా రూపొందుతోంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. మొత్తానికి, బయటకు యాక్షన్‌ స్టార్‌గా కనిపిస్తున్న ప్రభాస్‌ మనసులో మాత్రం రొమాంటిక్‌ హీరో దాగి ఉన్నాడని ఆయన మాటలతో స్పష్టమైంది. అభిమానులు ఇప్పుడు ఒక క్లాసిక్‌ లవ్‌ స్టోరీలో ప్రభాస్‌ను చూడాలని ఆశపడుతున్నారు.

Latest News