telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది !

గత ఏడాది 2023 నవంబర్ లో 1,05,235 డాక్యుమెంట్ల ద్వారా 1127.79 కోట్ల ఆదాయం వస్తే.. ఈ నవంబర్ నెలలో 1,19,317 డాక్యుమెంట్ల ద్వారా రూ. 1160.75 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నాయి.

  • Publish Date - December 4, 2024 / 10:05 AM IST

telangana : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిన్నదన్న వాదనలను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 32.96 కోట్ల ఆదాయం పెరిగిందని తెలిపాయి. గత ఏడాది 2023 నవంబర్ లో 1,05,235 డాక్యుమెంట్ల ద్వారా 1127.79 కోట్ల ఆదాయం వస్తే.. ఈ నవంబర్ నెలలో 1,19,317 డాక్యుమెంట్ల ద్వారా రూ. 1160.75 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నాయి. అప్పటితో పోలిస్తే డాక్యుమెంట్ల సంఖ్య 13.38 శాతం పెరిగింది. ఆదాయం 2.92 శాతం పెరిగింది.. అని తెలిపాయి. హెచ్ఎండీఏ పరిధిలో సానుకూల వృద్ధి నమోదైంది. ఈ నెలలోనే 625 డాక్యుమెంట్లతో రూ.21.09 కోట్ల ఆదాయ వృద్ధిని సాధించిందని పేర్కొన్నాయి. నాన్ హెచ్‌ఎండీఏ ప్రాంతంలో 3513 డాక్యుమెంట్లతో రూ.202.78 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపాయి. వాణిజ్య సముదాయాలతో పోలిస్తే గృహాలు, నివాస సముదాయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఎక్కువ వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి.