Site icon vidhaatha

Python | కొండ‌చిలువ‌ను కాపాడేందుకు.. ప్రాణాల‌ను లెక్క‌చేయ‌ని స్నేక్ సొసైటీ స‌భ్యుడు

Python | హైద‌రాబాద్ : హిమాయ‌త్ సాగ‌ర్( Himayat Sagar ) నిండు కుండ‌లా మారింది. సాగ‌ర్ క్ర‌స్ట్ గేటు వ‌ద్ద ఓ భారీ కొండ‌చిలువ( Python ) క‌ల‌క‌లం రేపింది. జ‌లాశ‌యం క్ర‌స్ట్ గేటు వ‌ద్ద ఇరుక్కున్న కొండ‌చిలువ‌ను స్నేక్ సొసైటీ( Snake Society ) స‌భ్యులు కాపాడారు. ఇక కొండ చిలువ‌ను ప్రాణాల‌తో కాపాడేందుకు స్నేక్ సొసైటీ స‌భ్యుడు చేసిన సాహ‌సం చూస్తే గుండెలు గుభేల్ అంటాయి.

స్నేక్ సొసైటీ స‌భ్యుడు త‌న న‌డుముకు తాడు కట్టుకుని క్ర‌స్ట్ గేటు లోప‌లికి దిగాడు. చాక‌చ‌క్యంగా భారీ కొండ చిలువ‌ను త‌న చేతుల్లోకి తీసుకున్నాడు. పైన ఉన్న వారు తాడుతో అత‌ని కొంత‌పైకి లాగారు. త‌ర్వాత క్ర‌స్ట్ గేట్ దిమ్మె మీద నిల్చున్న అత‌ను కొండ చిలువ‌ను సంచిలోకి వేసేందుకు య‌త్నించాడు. కానీ సాధ్యం కాలేదు. ఇక త‌న చేతికి చుట్టుకున్న కొండ‌చిలువ‌తోనే పైకి ఎక్క‌సాగాడు. కానీ అత‌ను ప‌ట్టుకోల్పోవ‌డంతో కొండ చిలువ కూడా మ‌ళ్లీ నీటిలో ప‌డిపోయింది. అది కాసేప‌టికి మ‌ళ్లీ ఒడ్డు వైపు చేర‌డంతో దాన్ని ప‌ట్టుకుని నెహ్రూ జూపార్కు అధికారుల‌కు అప్ప‌గించారు.

 

Exit mobile version