Dharai X bhu Bharathi | భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకోసం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం భూ భారతి చట్టానికి సంబంధించిన రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు చేసుకొనేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. సమస్య ఏదైనా అందుకు సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా తాజాగా పరిష్కరించనున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం వారి చేతికి రసీదు ఇవ్వనున్నారు. ఈ రసీదులో అప్లికేషన్ నంబర్, దరఖాస్తు దారుడి పేరు తదితర వివరాలు ఉంటాయి. దీంతో కచ్చితంగా రెవెన్యూ అధికారులు ప్రతి దరఖాస్తును పరిష్కరించాల్సి ఉంటుంది.
ఏయే వివరాలు సమర్పించాలి..
భూ సమస్యలు ఉన్న రైతులు తమ పేరు, పాస్ పుస్తకం వివరాలతో పాటు.. సర్వే నంబర్. సబ్ డివిజన్ నంబర్, భూమికి సంబంధించిన వివరణ, భూ స్వభావం, భూమి సంక్రమించిన విధానం.. ఏ విధమైన సమస్య అనే వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మొత్తం ఏడు కాలాలు ఉంటాయి?
ఏయే సమస్యలను పరిష్కరిస్తారు?
పాస్ బుక్ లో సర్వే నంబర్ ఎక్కకపోవడం.. సర్వే నంబర్ ఎక్కినా రైతు పేరు మీద ఎక్కకపోవడం.. సర్వే నంబర్ వచ్చినప్పటికీ సంతకం కాకపోవడం.. సర్వే నంబర్లలో సవరణ.. నిషేధిత జాబితాలో ఉన్న పేరు తొలగించడానికి లేదా చేర్చడానికి.. పట్టా హక్కుల గురించి వివరాలు ఇటువంటి సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించనున్నారు.
దరఖాస్తు ఫారం ఇక్కడ ఉన్నది..