విధాత : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు సోమవారం గ్రామ పంచాయతీలలో పదవి బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీలో 95 ఏళ్ల వయసులో గుంటకండ్ల రామచంద్రా రెడ్డి సర్పంచ్ పీఠం అధిష్టించారు. ఆయన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి కావడం విశేషం.
పంచాయతీ నూతన పాలకవర్గం పదవి ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న, నూతన వార్డు సభ్యులు తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Doctor Beats Patient | రోగిని చితకబాదిన డాక్టర్..వైరల్ వీడియో
Phone Tapping Case| ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ సీఎస్, ఇంటలిజెన్స్ చీఫ్
