చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

  • Publish Date - October 8, 2023 / 01:21 PM IST
  • నల్గొండలో అంబేద్కర్ విగ్రహానికి వినతి


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి ఎల్వీ యాదవ్, పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలియజేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చీకటి పాలనకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.


అనంతరం నాయకులు మాట్లాడుతూ దాదాపు 29 రోజులు రిమాండ్ లో ఉన్న చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఏపీ సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మచ్చ సైదులు, నల్గొండ పట్టణ ప్రధానకార్యదర్శి గోగుల నాగరాజు, దాడి మధుసూదన్ రెడ్డి, గంగాధర స్వరాజ్, భూతం వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, అండెం తిరుపతయ్య గౌడ్ పాల్గొన్నారు.