విధాత, హైదరాబాద్ : రేపు శుక్రవారం జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ పోలింగ్ ఈ నెల 11న జరుగనుండటం గమనార్హం. 14న కౌంటింగ్ జరుగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కెబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివరిసారిగా జరిగిన కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
