Site icon vidhaatha

Telangana : హవాలా రాకెట్ ను చేధించిన తెలంగాణ ఈగల్ టీమ్

Telangana anti-narcotics wing—EAGLE

విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో హవాలా రాకెట్ కు చెందిన 22 మంది ఆపరేటర్లను తెలంగాణ ఈగల్ టీమ్ అరెస్టు చేసింది. అరెస్టయిన హవాలా ఆపరేటర్ల నుంచి రూ.3కోట్లు స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ, ముంబై, గోవా, రాజస్థాన్, గుజరాత్ లలో ఈగల్ టీం ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన మ్యాక్స్ వెల్ మ్యా ఆధారంగా హవాలా రాకెట్ ను చేధించారు. మ్యాక్స్ వెల్ 150 అకౌంట్లు ద్వారా నైజీరియాకు డబ్బులు పంపంచాడని.. హవాలా ఆపరేటర్లు ఉత్తం సింగ్, భరత్ కుమార్ ల ద్వారా డబ్బుల పంపిణీ చేపట్టాడని.. బేబీ ఫ్రాక్స్, టీ షర్ట్స్, కిరాణా సరుకుల ఎక్స్ పోర్టుల పేరుతో డబ్బుల అక్రమ తరలింపు చేసినట్లుగా ఈగల్ టీమ్ గుర్తించింది.

అటు చర్లపల్లి డ్రగ్స్‌ కేసులో వాగ్దేవి కెమికల్స్‌ యాజమాని విజయ్‌, తానాజీని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు థానే కోర్టులో హాజరుపరిచారు. సీజ్‌ చేసిన కెమికల్స్‌ను కోర్టు ముందుంచారు. 12 మంది నిందితులకు కోర్టు 15రోజుల రిమాండ్ విధించింది. విజయ్‌, తానాజీల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పదేళ్లుగా విజయ్ డ్రగ్స్ తయారీలో ఉన్నాడని..విజయ్‌ వెనుక ఇంకొందరు ఉన్నారని..కేసు సమగ్ర విచారణకు నిందితుల కస్టడీ విచారణకు అనుమతించాలని పోలీసులు పిటిషన్ లో కోరారు.

Exit mobile version