Hyderabad Drugs Case : మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు!

మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ పేరు బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ల విచారణలో కీలక విషయాలు వెలుగుచూడటంతో ఈగల్ టీమ్ అతని కోసం గాలిస్తోంది.

Rakul Preet Singh brother Amanpreet drugs case

విధాత, హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌ పేరు తెరపైకి రావడంతో అతని కోసం ఈగల్ టీమ్, మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విల అరెస్టుతో హీరోయిన్ సోదరుడు అమన్‌ప్రీత్‌ పేరు బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్స్ గా ఉన్న ఆ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్‌ కొన్నట్లు ఈగల్‌ టీమ్‌ గుర్తించింది.ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గతేడాది కూడా అమన్‌ప్రీత్‌ సైబరాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన ఇద్దరు వ్యాపారులు నలుగురు రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలతో నిఘా పెట్టింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల డిసెంబర్ 19న మాసబ్‌ ట్యాంక్ వద్ద ట్రూప్‌బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్ సోదరుడు తరచుగా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి :

Big Snakes| భయపెట్టిన బడా పాములు..చూస్తే హడల్!
Actress | ఆ సీన్ వివ‌రిస్తానంటూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.. ఆ త‌ర్వాత ఆరు నెల‌ల‌కే మ‌ర‌ణం..

Latest News