GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం మూడు విభాగాలుగా విభజించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో మూడు కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం-1995, సెక్షన్-3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.
మూడు కార్పొరేషన్లు ఇవే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)
కమిషనర్లు వీరే
జీహెచ్ఎంసీ కమిషనర్ – ఆర్వీ కర్ణన్
సీఎంసీ కమిషనర్ – శ్రీజన
ఎంఎంసీ కమిషనర్ – వినయ్ కృష్ణారెడ్డి
