Allu Arjun | అల్లు అర్జున్‌పై తప్పుడు ప్రచారం… లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన హీరో టీమ్

Allu Arjun |టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇటీవల అల్లు అర్జున్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ వైరల్ అవుతున్న ఒక వీడియో పూర్తిగా అబద్ధమని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Allu Arjun |టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇటీవల అల్లు అర్జున్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ వైరల్ అవుతున్న ఒక వీడియో పూర్తిగా అబద్ధమని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని వెల్లడించింది.అల్లు అర్జున్‌కు సంబంధించిన ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ వాస్తవాలకు పూర్తిగా విరుద్ధమని ఆయన టీమ్ పేర్కొంది.

ఇటీవల అల్లు అర్జున్ గురించి వచ్చిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఆయన ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ప్రవర్తించే వ్యక్తి. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం” అని ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై ఇప్పటికే లీగల్ టీమ్ చర్యలు ప్రారంభించిందని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకూడదని అభిమానులు, నెటిజన్లను కోరింది.

ఇటీవలి కాలంలో ప్రముఖులపై ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోలు, అపోహలు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ నుండి వ‌చ్చే ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. ఈ సినిమాలో బ‌న్నీ లుక్ ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

Latest News