Drugs | ‘కబాలి’ నిర్మాత కాల్ లిస్ట్‌తో కదులుతోన్న డొంక.. సెలబ్రిటీల లిస్ట్ పెరుగుతోంది

Drugs | విధాత‌: సినీ లోకంలో పూటకో సంచలనం. కాకపోతే ఒక్కో ఘటన ఒక్కో రకంగా ఆసక్తిగా మారుతూ వస్తుంది. ప్రస్తుతం కేపీ చౌదరి డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అతనితో సంబంధాలున్న పలువురి తారల పేర్లు బయటకొచ్చాయి. ఇందులో చాలావరకూ సెలబ్రెటీ స్థానంలో ఉన్నవాళ్ళే కావడం విశేషం. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే తమ హాట్ హట్ వీడియోలు, రీల్స్‌తో కుర్రకారును ఊరిస్తున్న తల్లీకూతుళ్ళు సురేఖావాణి, సుప్రీతల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా వార్తలు […]

  • Publish Date - June 27, 2023 / 02:19 AM IST

Drugs |

విధాత‌: సినీ లోకంలో పూటకో సంచలనం. కాకపోతే ఒక్కో ఘటన ఒక్కో రకంగా ఆసక్తిగా మారుతూ వస్తుంది. ప్రస్తుతం కేపీ చౌదరి డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అతనితో సంబంధాలున్న పలువురి తారల పేర్లు బయటకొచ్చాయి. ఇందులో చాలావరకూ సెలబ్రెటీ స్థానంలో ఉన్నవాళ్ళే కావడం విశేషం.

మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ తెరిస్తే తమ హాట్ హట్ వీడియోలు, రీల్స్‌తో కుర్రకారును ఊరిస్తున్న తల్లీకూతుళ్ళు సురేఖావాణి, సుప్రీతల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తల్లీకూతుళ్ళిద్దరూ కేపీ చౌదరికి మంచి స్నేహితులని తెరమీదకు వచ్చింది.

దీనితో పాటు కేపీ చౌదరి కేసులో ఇంకా చాలామందే ఉండి ఉండచ్చని తెలుస్తుంది. అతని కాంటాక్ట్ లిస్ట్‌లో దాదాపు తొమ్మిది వేలకు పైగా కాంటాక్ట్స్ ఉన్నాయట. అతనితో ప్రముఖులు దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా చౌదరికి సన్నిహితంగా ఉన్నవారిలో సురేఖావాణి, సుప్రీతతో పాటు అషురెడ్డి, జ్యోతి వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి.

వీళ్లతో కేపీ చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఫోటోల వరకేనా లేక డ్రగ్స్ దందాలో కూడా వీళ్ళకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదే కేసులో మరో కీలకమైన వ్యక్తి బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు కూడా తెరమీదకు వచ్చింది. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే డ్రగ్స్ పార్టీ జరిగిందట. అయితే ఈ కేస్ చార్జ్ షీట్లో సిక్కిరెడ్డి పేరు లేక పోవడం కొసమెరుపు. గత నెలరోజులుగా ఆమె హైదరాబాద్‌లో లేదని, ఆమెకు ఈ కేస్‌తో సంబంధం ఉండే అవకాశం లేదని ఆమె తండ్రి పోలీసులకు తెలియజేశాడు.

కానీ ఓపక్క కేపీ ఫోన్ లిస్ట్, పరిచయాలు చూస్తే చాలా పెద్ద జాబితానే కనిపిస్తుంది. పెద్ద పెద్దవాళ్ళతో అతనికి ఉన్న పరిచయాలు కేసులో ఎవరిని బుక్ చేస్తాయా అని అనిపిస్తుంటే.. అతనితో అప్పటి వరకూ సన్నిహితంగా ఉన్నందుకు ఎవరి పీకకు ఈ కేస్ చుట్టుకుంటుందా అని సినీ జనాల్లోనూ కంగారు మొదలయినట్టే కనిపిస్తుంది.

సంచలనం రేకెత్తిస్తూ కేపీ చౌదరి దగ్గర దొరికిన సమాచారంతో ఇంకొందరి పేర్లు బయటపడే అవకాశమూ లేకపోలేదు. అయితే కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్న సెలబ్రిటీలంతా.. అతను కేవలం ఫ్రెండ్ లేదంటే కాస్త పరిచయం అని మాత్రమే అంటున్నారు. అంతేకానీ, డ్రగ్స్ విషయంలో మాకెలాంటి సంబంధము లేదని అనవసరంగా మమ్మల్ని ఈ వివాదంలోకి లాగవద్దని అషు రెడ్డి, సురేఖౠ వాణి వాపోతున్నారు.

మరి ఈ కేసు ఎటువైపు దారి తీస్తుందో.. చూడాల్సి ఉంది. గతంలోనూ ఓ నెల రోజుల పాటు హడావుడి చేసి.. ఆ తర్వాత ఏమీ లేదన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోమారు టాలీవుడ్‌లో ఈ డ్రగ్స్‌పై హాట్ హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. ఈసారైనా ఏమైనా ముందుకు తీసుకువెళతారో.. లేదంటే, పొలిటికల్ పెద్దలు కలుగజేసుకుని.. మరోదారి పట్టిస్తారో వెయిట్ అండ్ సీ..

Latest News