మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామన్న నిమ్స్ వైద్యులు..
విధాత , హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. హైబీపీతో అస్వస్థతకు గురైన ఆయనను శనివారం నిమ్స్‌లో చేర్పించారు. ఈ మేరకు వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేసి ఆయన ఆరోగ్యంనిలకడగానే ఉందని, మరో మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ జయరాజ్‌కు గత ఏడాది పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారం లభించింది. కాళోజీ నారాయణరావు పేరు మీద ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ అవార్డును 2023 సంవత్సరానికి గాను జయరాజ్ ను ఎంపిక చేశారు.
కవి, రచయిత, గాయకుడు జయరాజ్ కు 60 ఏళ్లు. ఆయన స్వస్థలం మహబూబాద్ జిల్లా. ఎన్నో కష్టాలను చవి చూశారు, దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ సమ సమాజం కోసం ఆక్రోశించాడు. తన కలాన్ని, గొంతును ప్రజల కోసం అంకితం చేశాడు. బుద్దుని బోధనల పట్ల ప్రభావితం అయ్యాడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలకు ఆకర్షితుడయ్యాడు. ప్రకృతి, పర్యావరణ కవిగా , తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.