తెలంగాణ విద్యుత్ దక్షిణ పంపిణీ సంస్థ(TGSPDCL) తమ ఉద్యోగుల పదోన్నతుల విషయమై తీపి కబురు వినిపించింది. సంస్థవ్యాప్తంగా 2263 మందికి ప్రమోషన్లు(Promotions to 2263 employees) కల్పించింది. ఈ విషయమై సంస్థ ఒక ప్రకటన చేసింది. ఇందులో 16 మంది పి అండ్ జి(P&G) ఆఫీసర్లు కాగా, 47 గురు అకౌంట్స్నుండి, 2099 మంది ఉద్యోగులు ఆపరేషన్స్ అండ్ మెయిన్టెనెన్స్(O&M) నుండి ఉన్నారు.
కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ(Musharraf Ali Faruqui) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. కంపెనీ మేనేజ్మెంట్ ఈ సందర్భంగా జూనియర్ లైన్మెన్(Junior Lineman) నుండి చీఫ్ జనరల్ మేనేజర్(CGM) స్థాయి వరకు పదోన్నతులు కల్పించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 101 మంది ఇంజనీరింగ్(Engineering) విభాగంలో, 47మంది అకౌంట్స్‌లో, 2099మంది ఆపరేషన్స్ అండ్ మెయిన్టెనెన్స్లో, పదహారుగురు పి అండ్ జి నుండి ప్రమోషన్లు పొందినట్లు తెలిసింది.
మరిన్ని వివరాల్లో, ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(SE) చీఫ్ ఇంజనీర్లు(CE)గా, ఒక జనరల్ మేనేజర్(GM), జాయింట్ సెక్రటరీ(JS)గా పదోన్నతి పొందారు. ఇంకా 8మంది డివిజనల్ ఇంజనీర్ల(DE)ను సూపరింటెండెంట్ ఇంజనీర్లు(SE)గా, 30మంది ఏడీఈ(ADE)లను డీఈ(DE)లుగా, 58 మంది ఏఈ(AE)/ఏఈఈ(AEE)లను ఏడీఈ(ADE)లుగా ప్రమోషన్ ఇచ్చారు. మరో 1650 జూనియర్ లైన్మన్ల(JLM)కు అసిస్టెంట్ లైన్మన్లు(ALM)గా పదోన్నతి కల్పించారు.
ఈమధ్యే ఈ పదోన్నతుల విషయమై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖా మంత్రి కూడా అయిన మల్లు భట్టి విక్రమార్క(DCM Mallu Bhatti Vikramarka) దృష్టికి తేగా, ఆయన సత్వరమే స్పందించి, సాధ్యమైనంత త్వరగా ప్రమోషన్ల విషయాన్ని పరిష్కరిచాల్సిందిగా సిఎండీని ఆదేశించారు. దాని ఫలితమే నేటి ఈ ఉత్తర్వులు. ఈ ప్రమోషన్లు 2017వ సంవత్సరం నుండి పెండింగ్(pending)లో ఉండగా, చాలామంది అర్హులైన ఉద్యోగులు పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేసారు. సిఎండీ ఫారుఖీ మాట్లాడుతూ, ఈ పదోన్నతుల వల్ల ఖాళీ అయిన స్థానాలను భర్తీ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేసారు.