Site icon vidhaatha

Telangana Women Commission | కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు.. 24న హాజరు కావాలని ఆదేశం

Telangana Women Commission | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR)కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24న మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.

బస్సుల్లో మహిళలు ఎల్లిపాయలు ఒలుచడం, కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క (Minister Seethakka)వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘బస్సుల్లో ఎల్లిపాయలు ఒలచడం.. కుట్లు, అల్లికలు మేం వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, బస్సుల్లో సీట్లు దొరక్క ఓ వైపు జనం తన్నుకుంటున్నారని, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్కలు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ నుంచి కేటీఆర్‌కు నోటీసులు అందాయి. అయితే అంతకుముందే ట్విటర్ వేదికగా కేటీఆర్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పడం గమనార్హం.

Exit mobile version