వైద్యశాఖలో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం

ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధ‌మైంది.

  • Publish Date - June 15, 2024 / 07:37 PM IST

విధాత, హైద‌రాబాద్‌: ప్ర‌జారోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల కొర‌త నివారణపై కసరత్తు చేసింది. కొత్తగా 531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్‌బీ) త్వ‌ర‌లోనే ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. నియామ‌కాల అనంత‌రం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్జ‌న్లను నియ‌మించ‌నున్నారు. అలాగే 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టులు, 31స్టాఫ్ నర్సుల పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది.

Latest News