తెలంగాణ‌లో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఈ స‌ర్టిఫికెట్లు త‌ప్ప‌నిస‌రి..!

తెలంగాణ రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల భ‌ర్తీ మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది.

  • Publish Date - June 28, 2024 / 02:30 PM IST

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టుల భ‌ర్తీ మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. డీపీహెచ్ అండ్ ఎఫ్‌డ‌బ్ల్యూ డీఎంఈ విభాగంలో 431 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో మల్టీ జోన్ -1లో 270, మ‌ల్టీజోన్‌-2లో 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండ‌గా, మ‌ల్టీజోన్‌-1లో 1, మ‌ల్టీజోన్-2లో 3 పోస్టులు ఉన్నాయి. త‌దిత‌ర వివ‌రాల కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

ఈ స‌ర్టిఫికెట్లు త‌ప్ప‌నిస‌రి..

1. ఆధార్ కార్డు
2. ఎస్సెస్సీ మెమో(పుట్టిన తేదీ ధృవీక‌ర‌ణ కోసం)
3. ఎంబీబీఎస్ క‌న్సాలిడేటేడ్ మార్క్స్ మెమో
4. ఎంబీబీఎస్ స‌ర్టిఫికెట్
5. తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్
7. ఎక్స్‌పీరియ‌న్స్ స‌ర్టిఫికెట్స్(అర్హ‌త ఉంటే)
8. 1 నుంచి 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బోన‌ఫైడ్ స‌ర్టిఫికెట్స్
9. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం
10. నాన్ క్రిమిలేయ‌ర్ స‌ర్టిఫికెట్
11. ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం

అర్హ‌త‌లు ఇవే..

డీపీహెచ్ అండ్ ఎఫ్‌డ‌బ్ల్యూ డీఎంఈ విభాగంలోని పోస్టుల‌కు ఎంబీబీఎస్ త‌ప్ప‌క చ‌దివి ఉండాలి
ఐపీఎం విభాగంలోని పోస్టుల‌కు తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో క‌చ్చితంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోని ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు ఎంతంటే..?

రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌, పీహెచ్, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు.

Latest News