Site icon vidhaatha

Burra Ramulu : హక్కుల సారధి డాక్టర్ బుర్రా రాములు

burra ramulu

– ఆశయాలను కొనసాగిద్దాం.
– రాములుకు ఘనంగా నివాళులు

విధాత, వరంగల్ ప్రతినిధి: దేశంలో పెరుగుతున్న మతోన్మాద దాడుల పట్ల హక్కుల సంఘాల నాయకులుగా, కార్యకర్తలుగా ప్రశ్నించడమే కాక ప్రజలకు ఉండే హక్కులను కాపాడుకొనుటకు మనమంతా పనిచేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ కోరారు. మానవ హక్కుల వేదిక సారథి డాక్టర్ బుర్ర రాములు 13వ యాది సభ హెచ్ఆర్ఎఫ్ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు అధ్యక్షతన ఖిలా వరంగల్ పడమరకోట చమన్ సెంటర్లో జరిపారు .

ముందుగా బుర్ర రాములు చిత్రపటానికి ఆయన సతీమణి బుర్ర స్వరూప తో పాటు హక్కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయనను యాది చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సమావేశంలో హరికృష్ణతో పాటు ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు, టి పి టి ఎఫ్ రాష్ట్ర నాయకులు మైసా శ్రీనివాస్, కడారి భోగేశ్వర్ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్, జర్నలిస్టు ఎస్.రవి ,న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజులు అన్నారు .

యాది సభకు హాజరైన నాయకులు మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్ లు ప్రజల మధ్య మతపర వైశ్యామ్యాలు రెచ్చగొట్టి హిందూ ధర్మ సంస్కృతి పేరుతో మనువాదాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నదని అన్నారు. మైనార్టీ మతస్తులు, జాతుల, దళిత, ఆదివాసి ప్రజలపై దాడులకు ప్రేరేపించి చంపేస్తున్నదని వారు అన్నారు . బిజెపి, ఆర్ఎస్ఎస్ ల నుండి రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకొనుటకు అందరం కలిసి పని చేయాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు పాలకుర్తి సత్యనారాయణ, యాదగిరి, దిలీప్, పి శ్రీనివాస్, సాదు రాజేష్, మహిళా సంఘం జిల్లా నాయకురాలు రత్నమాల, ఐ ఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, నలిగంటి విజయపాల్, బి ఐలయ్య ప్రజా కళాకారులు బి కే , చంద్రమౌళి, మైదం సంజీవ, రాములు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Exit mobile version