Site icon vidhaatha

న‌ల్ల‌గొండ‌ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఎంసీ కోటిరెడ్డి

విధాత‌: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి నియోజకవర్గ అభ్యర్దిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన టి ఆర్ యస్ అభ్యర్థి యం సి కోటిరెడ్డి కి నల్లగొండ జిల్లా కేంద్రం లోని స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బి-ఫార్మ్ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,నల్లగొండ,సూర్యపేట,భోనగిరి యాదాద్రి జిల్లాల ప్రజాపరిషత్ చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి,గుజ్జ దీపికా యుగంధర్ రావు,ఎలిమినేటి కృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి,తక్కెళ్లపల్లి రవీందర్ రావు,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్,కంచర్ల భూపాల్ రెడ్డి,యన్.భాస్కర్ రావు,నోముల భగత్,ఫైళ్ల శేఖర్ రెడ్డి,శానంపూడి సైదిరెడ్డి,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

READ MORE:జ‌గ‌న్ తుగ్ల‌క్ 3.0. మూర్ఖుడు : నారా లోకేష్ https://vidhaatha.com/andhra-pradesh/cm-jagan-is-tuglak-3-0-lokesh

Exit mobile version