Site icon vidhaatha

నల్లగొండ: ప్రముఖ వ్యాపారవేత్త మృతి .. మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి దిగ్భ్రాంతి

విధాత‌: ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ టీఆర్ఎస్ నేత చిలుకల గోవర్ధన్ మంగళవారం అకస్మా త్తుగా మరణించడంపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన లైన్స్ క్లబ్, వాసవి సేవా సమితి కార్యక్ర మాల ద్వారా ప్రజా సమూహానికి చేరువైన నాయకుడు గోవర్ధన్ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

తన అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారని ఆయన చెప్పారు. నిబద్ధత, నిజాయితీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నిర్మొహమాటంగా వ్యవహరించడం అన్నది సొం తం చేసుకున్న గోవర్ధన్ నల్లగొండ జిల్లా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు.

Exit mobile version