Site icon vidhaatha

గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. టీఎస్పీఎస్సీ వెల్లడి

విధాత, హైదరాబాద్ : గ్రూప్-4 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది. జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌ను 1:3 నిష్ప‌త్తిలో, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌ను 1:5 నిష్ప‌త్తిలో పిల‌వ‌నున్నారు.

క‌మ్యూనిటీ, నాన్ క్రిమి లేయ‌ర్(బీసీల‌కు), పీడ‌బ్ల్యూడీ స‌ర్టిఫికెట్స్, స్ట‌డీ లేదా రెసిడెన్స్ స‌ర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి ఏడు వ‌ర‌కు), రిజ‌ర్వేష‌న్ క‌లిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేష‌న్, క్వాలిఫికేష‌న్ స‌ర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని టీఎస్పీఎస్సీ సూచించింది. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌మ‌యంలో వీటిలో ఏ డాక్యుమెంట్ స‌మ‌ర్పించ‌క‌పోయినా ఆ అభ్య‌ర్థుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని స్ప‌ష్టం చేసింది.

Exit mobile version