విధాత, హైదరాబాద్ : గ్రూప్-4 ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ల కోసం నమోదు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. అలా చేసిన వారికే విడతల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు వెరిఫికేషన్ హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్ సైట్‌లో పొందుపరుచనున్నట్లుగా పేర్కోంది. రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. పరీక్ష జూలై 2023లో జరిగింది. 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్ష నిర్వహించారు. టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 9న సాధారణ ర్యాంక్‌ల జాబితాను ప్రకటించింది. ఎన్నికల కోడ్ రాక కారణంగా మెరిట్ జాబితా ఆలస్యమైంది. ఇప్పుడు మెరిట్ జాబితాను విడుదల చేసి, వెబ్ ఎంపికల తేదీలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమైన సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని కమిషన్ సూచించింది. ధృవీకరణ పత్రాల సమయంలో సూచించి పత్రాలన్నీ తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఎలాంటి అదనపు గడువు ఇవ్వబోమని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.
గ్రూప్ -4 మెరిట్ జాబితా వెల్లడి … 13నుంచి వెబ్ ఆప్షన్లు
గ్రూప్-4 ఉద్యోగ భర్తీ ప్రక్రియకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది.

Latest News
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!