Site icon vidhaatha

Etala Rajender | బేషరత్తుగా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి … బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

విధాత: ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎలాంటి కండిషన్స్ లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారన్నారు. అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రూ. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిఉండగా ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి, రుణవిముక్తులను చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version