USA fire accident| అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం

అమెరికాలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధినిలు దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు కూడా హైదరాబాద్ వాసులే కావడం గమనార్హం.

విధాత, హైదరాబాద్ : అమెరికా(USA fire accident)లో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధిని(Telugu students dead)లు దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు కూడా హైదరాబాద్ వాసులే కావడం గమనార్హం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడకు చెందిన సహజరెడ్డి ప్రమాదంలో మరణించింది. ఉడుముల జయకర్ రెడ్డి పెద్ద కుమార్తె సహజ రెడ్డి న్యూయార్క్ లో ఎంఎస్ చదువుతుంది. బర్మింగ్‌హామ్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సహజ రెడ్డి మృతి చెందారు. ఓ అపార్ట్‌మెంట్ లో చెలరేగిన మంటలలో 13మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వారంతా అలబామా యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులే కావడం గమనార్హం.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటి నుంచి తప్పించుకోవడం విద్యార్థులకు కష్టమైంది. లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొని వచ్చారు . ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లి కి చెందిన మరొక విద్యార్థిని మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కుటుంబానికి పెద్ద దిక్కవుతారనుకుని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన తమ పిల్లలు అగ్నిప్రమాదంలో చనిపోవడం పట్ల మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Latest News