న్యూఢిల్లీ : వినాయక నిమజ్జనానికి వెళ్లివస్తున్న సందర్భంగా లండన్ లో జరిగిన రోడ్డు(London accident) ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు(Hyderabad students died)మృతి చెందారు. మృతులను నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు.
ఉన్నత చదువుల కోసం చైతన్య, రిషితేజలు 8నెలల క్రితం లండన్ వెళ్లారు. అక్కడ వారు వినాయక చవివి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నిమజ్జనం కోసం మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చైతన్య, రిషితేజ మృతిచెందారు. వారి మృతితో కుటుంబసభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది.