Site icon vidhaatha

Hyderabad Road Accident| హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం..యువతి మృతి

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad), లంగర్ హౌస్ దర్గా(Langar House) సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు(Road Accident) ప్రమాదంలో ఓ కియా కారు(Kia Car) అదుపు తప్పి పోలీస్ వాహనాన్ని(Police Vehicle) ఢీకొన్న ఘటనలో కారులోని కశ్వి(20) అనే యువతి దుర్మరణం పాలయ్యింది. వినాయక నిమజ్జనోత్సవం ట్రాఫిక్ విధుల్లో ఉన్న డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని వేగంగా వచ్చిన కియా కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులోని యువతి అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం(Drunk Driving) వల్లే ప్రమాదం జరిగిందన్న పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Exit mobile version