Warangal | జల సంరక్షణలో వరంగల్ జిల్లాకు అవార్డు

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2 లో వరంగల్ జిల్లా కు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో డిల్లీ‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డుతో పాటు రూ. కోటి దక్కించుకొని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అవార్డు స్వీకరించారు.

విధాత, వరంగల్ ప్రతినిధి:

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2 లో వరంగల్ జిల్లా కు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో డిల్లీ‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డుతో పాటు రూ. కోటి దక్కించుకొని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. జల వనరుల పరిరక్షణకు మరింత కృషి చేస్తూ ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

Latest News