విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారు.
రమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.. ఇతనే కుమారస్వామి అనుకోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించి, నిన్న తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సిబ్బంది రేపు రమ్మని పంపించారు. ఈరోజు కుటుంబసభ్యులు వెళ్లగా కుమారస్వామి బ్రతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్

Latest News
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు
సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు