విధాత, ఆదిలాబాద్: భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కాకుండా మండుటెండలతో అల్లతల్లడమైపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
వాతావరణశాఖ చల్లటి కబురు.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి

Latest News
విరోష్’ రిసెప్షన్‌కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి
ఇరాన్ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి
ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనం ఆక్షేపణీయం : సోనియాగాంధీ
అబ్బా అనిపించేలా నభా.. నభాను ఇలా చూస్తే గుండెజారి గల్లంతే
ప్రజలకొక న్యాయం..మంత్రికి, అల్లుడికి మరో న్యాయమా ?: హరీశ్ రావు
నేడు చంద్రగ్రహణం: ఆలయాల మూసివేత..అక్కడ తెరిచే ఉంటాయి!
టైట్ ఫిట్ డ్రెస్‌లో భాగ్య శ్రీ.. సాలీడ్ ఫోజులతో మతిపోగుడుతున్న ముద్దుగుమ్మ
ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ