విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. 2014లో యాదాద్రి ఆలయం ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఈవో గీత 2020లో పదవి విరమణ చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు పురోగతిలో ఉండటంతో ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది. గీత హాయంలోనే యాదాద్రి ఆలయ పునరుద్ధరణ ప్రారంభం పూర్తి కావడం విశేషం.
ఈవో గీత పనితీరుపై గత ప్రభుత్వ హాయంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. స్థానిక భక్తులకు రోజువారి దర్శనం లేకుండా కేవలం శనివారం మాత్రమే రావాలని, ఆటోలను గుట్టపైకి రావద్దని, జర్నలిస్టులు రావద్దని పలు ఆంక్షలు పెట్టారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు ఇంకా కొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. విమాన గోపురం బంగారు తాపడం పెండింగ్‌లో ఉంది. ఈ నేపధ్యంలో ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వం ఈవో గీత స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారంది.
యాదాద్రి ఈవోగా కె.రామకృష్ణారావు
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన ఆలయ ఇంచార్జీ ఈవోగా ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ కె. రామకృష్ణ రావు బాధ్యతలు చేపట్టారు. ఈవో గీత గురువారం రాజీనామా సమర్పించడం..ఆ వెంటనే రామకృష్ణారావును కొత్త ఈవోగా నియమించడటం జరిగిపోయింది.
2014నుంచి ఈవో గీత యాదాద్రి ఈవోగా పనిచేశారు. ఆమె హాయంలో మాజీ సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణం జరిపించారు. ఈవోగా గీత 2020లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ప్రభుత్వం ఆమెనే కొనసాగించింది. ప్రభుత్వం మారడంతో ఆమె రాజీనామా చేయగా, ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు కూడా గురువారమే తన బాధ్యతలు స్వీకరించారు