Site icon vidhaatha

Yadadri | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ట్రయల్ రన్ సక్సెస్

రెండు యూనిట్లలో త్వరలో విద్యుత్తు ఉత్పత్తి

విధాత : నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రెండు యూనిట్ల నిర్వాహణపై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రెండు యూనిట్లకు సంబంధించిన యాక్సిలరీ బాయిలర్లను లైట్ అప్ చేసిన అధికారులు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు.

మొత్తంగా 4,000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రెండు యూనిట్ల ట్రయల్ రన్ సక్సెస్‌తో 1600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. త్వరలోనే విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ సైతం అనుమతులు మంజూరీ చేసింది.

Exit mobile version