యాదగిరిగుట్టలో అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం సందర్శనలో భాగంగా రూ.99.55కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. దేవస్థానానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చక పండితులు అధికారిక స్వాగతం పలికారు.

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం సందర్శనలో భాగంగా రూ.99.55కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. దేవస్థానానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు, అర్చక పండితులు అధికారిక స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారి దర్శనం అనంతరం అర్చక బృందం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు. శ్రీ స్వామి వారి మహా ప్రసాదం, స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో భవాని శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు రేవంత్ కు అందచేశారు.

అనంతరం కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న అనంతరం.. క్షేత్రంలో 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.43.80 కోట్లతో నిర్మించనున్న వేదపాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత యాదగిరిగుట్టలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పై కప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట పెద్దగుట్టపైన హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి.. యాదగిరిగుట్టకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి :

ధాన్యం కుప్ప వద్ద మరో రైతు హఠాన్మరణం
గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికా కొత్త రూల్​తో భారతీయుల్లో టెన్షన్

Latest News