Rukmini Vasanth | సినీ పరిశ్రమలో నటనతో పాటు గ్లామర్ కూడా కెరీర్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా భావిస్తుంటారు. కొంతమంది నటీమణులు మొదట్లో సంప్రదాయ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ తర్వాత గ్లామర్ వైపు అడుగులు వేస్తుంటారు. అయితే ఎప్పుడూ హోమ్లీ ఇమేజ్‌తో కనిపించే హీరోయిన్ ఒక్కసారిగా గ్లామర్ లుక్‌లో దర్శనమిస్తే అది సహజంగానే చర్చకు దారి తీస్తుంది. ప్రస్తుతం కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు కూడా ఇలాంటి కారణంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి వసంత్, తన సహజ నటనతో, అమాయకమైన హావభావాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తుండగా, మరోవైపు యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
పిక్స్ వైరల్..
అయితే తాజాగా సోషల్ మీడియాలో రుక్మిణికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విజువల్స్ బయటకు రావడంతో అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
వైరల్ అవుతున్న వీడియోల్లో భారీ షూటింగ్ సెటప్, కెమెరా సిబ్బంది, టెక్నికల్ టీమ్ కనిపిస్తుండటంతో ఇది ఏదైనా ఫోటోషూట్ లేదా ప్రకటనకు సంబంధించినదై ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ వీడియోల నిజానిజాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏఐతో రూపొందించినవా..
ప్రస్తుతం ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ వీడియోలు కూడా అలాంటి సాంకేతికతతో రూపొందించి ఉండవచ్చని నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వైరల్ కంటెంట్‌పై రుక్మిణి వసంత్ లేదా ఆమె బృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్థాయిలో పెద్ద చిత్రాలతో ముందుకు సాగుతున్న సమయంలో ఈ తరహా ప్రచారం రావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఈ వీడియోల వెనుక అసలు నిజం ఏమిటన్నది రుక్మిణి స్పందన తర్వాతే పూర్తిగా స్పష్టమయ్యే అవకాశం ఉంది.
