Site icon vidhaatha

యూ ట్యూబర్ ప్రణీత్ అరెస్టు … బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు

విధాత, హైదరాబాద్ : సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతు ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరు పరిచిన పిదప హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే హనుమంతుతోపాటు మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో తండ్రీకూతురుపై చర్చపెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వారిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఒకరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కలు సీరియస్‌గా స్పందించి కేసుల నమోదుకు ఆదేశించారు.

Exit mobile version